News January 22, 2026
హనుమాన్‌పేట్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

విజయవాడ హనుమాన్‌పేటలోని ఏపీలోని అన్ని జిల్లాల ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, విద్యార్థుల పౌరహక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోగా, రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Similar News
News January 23, 2026
ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.
News January 23, 2026
విజయవాడ: LRS గడువు మరోసారి పొడిగింపు!

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. ఎల్ఆర్ఎస్-2025 కింద రూ.10,000 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 62 వేల దరఖాస్తులు అందాయని చెప్పారు. మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
News January 23, 2026
ఒక్క బంతికే 11 రన్స్

NZతో రెండో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగారు. ఫౌల్క్స్ వేసిన మూడో ఓవర్లో 22 రన్స్ బాదారు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో మొత్తం 24 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్ తొలి బంతి ఫోర్ వెళ్లగా అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. తర్వాత బౌలర్ 2 వైడ్లు వేశారు. ఆ తర్వాత బాల్ ఫోర్ వెళ్లింది. దీంతో ఒక్క బంతికే 11 రన్స్ (4+nb+wd+wd+4) వచ్చినట్లయింది.


