News December 15, 2025

హనుమాన్ చాలీసా భావం – 39

image

జో యహ పఢై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ||
ఎవరైతే హనుమాన్ చాలీసాను నిష్టగా పఠిస్తారో, వారికి తప్పకుండా వారు కోరుకున్న విజయం లభిస్తుంది. ఈ విషయాన్ని ధృవీకరించడానికి.. అంటే ఈ సత్యానికి శివుడే సాక్షిగా ఉన్నాడు. కాబట్టి హనుమాన్ చాలీసా చదవడం ద్వారా హనుమంతుడి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడి ఆశీస్సులు కూడా లభించి, కోరికలు నెరవేరుతాయని నమ్మకం. <<-se>>#HANUMANCHALISA<<>>

Similar News

News December 19, 2025

హాదీ మృతితో బంగ్లాలో అల్లర్లు.. ఎవరతడు?

image

రాడికల్ ఇంక్విలాబ్ మోర్చాకు చెందిన కీలక నేత షరీఫ్ <<18609088>>ఉస్మాన్<<>> హాదీ. హసీనాను PM పదవి నుంచి దించేందుకు చేసిన ఘర్షణలకు ఆయనే నాయకత్వం వహించారు. దీంతో బంగ్లాలో హాదీ హీరో అయ్యారు. 2026 FEBలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఈ నెల 12న ఢాకాలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించగా నిన్న చనిపోయారు. దీంతో ఆయన మద్దతుదారులు అల్లర్లకు తెగబడ్డారు.

News December 19, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్: ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’

image

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ <<18547375>>ఎస్టేట్‌<<>>లోని మరిన్ని ఫొటోలను US హౌస్‌ డెమొక్రాట్ల కమిటీ రిలీజ్ చేసింది. మొత్తం 68 ఫొటోల్లో బిల్ గేట్స్, నోవమ్ చోమ్‌స్కీ, వూడీ అలెన్ వంటి వాళ్లు ఉన్నారు. ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’ అంటూ ఉన్న మెసేజీలు, పేర్లు బ్లర్ చేసిన రష్యా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాల మహిళల పాస్‌పోర్టులూ ఉన్నాయి. కమిటీ వద్ద మొత్తం 95 వేల ఇమేజెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

News December 19, 2025

AIIMS బిలాస్‌పుర్‌లో ఉద్యోగాలు

image

AIIMS బిలాస్‌పుర్ 68 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, BDS ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.56,100+అలవెన్సులు చెల్లిస్తారు. డిసెంబర్ 23న రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in