News December 16, 2025
హనుమాన్ చాలీసా భావం – 40

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా ||
భావం: ‘తులసీదాసు వలె నేను కూడా నీ పరమ భక్తుడని హనుమా! కాబట్టి నా హృదయాన్ని కూడా నీ నివాసంగా చేసుకో. నాపై కరుణ చూపి నన్ను అనుగ్రహించు. నీ అపారమైన శక్తితో నన్ను కాపాడు. భయాలను, దోషాలను తొలగించు స్వామీ!’
హనుమాన్ చాలీసా ఇంతటితో పూర్తైంది. మొదటి శ్లోకం నుంచి భావాన్ని తెలుసుకోవడానికి <<-se>>#HANUMANCHALISA<<>> హ్యాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేయండి.
Similar News
News December 18, 2025
క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో వేయాలి.
News December 18, 2025
పాపం.. ఆయనకు ఒక్కరే ఓటేశారు!

TG: నిన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా యాదాద్రి(D) అడ్డగూడూర్(M) ధర్మారంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకటో వార్డులో మొత్తం 119 ఓట్లుండగా కప్పల గోపికి 118 ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థికి ఒకే ఓటు పడింది. ఇక ఆదిలాబాద్(D) ఉండంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేందర్ తొలుత 4 ఓట్లతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన రీకౌంటింగ్ కోరగా చివరికి మహేందరే 6 ఓట్లతో గెలుపొందారు.
News December 18, 2025
రూ.1.6 లక్షలు.. సైనికులకు ట్రంప్ క్రిస్మస్ గిఫ్ట్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ సైనికులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.1.6 లక్షల ($1,776) ‘వారియర్ డివిడెండ్’ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 1776లో దేశ స్థాపనకు గుర్తుగా ఆ మొత్తాన్ని మిలిటరీ సర్వీస్ మెంబర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులు సిద్ధమయ్యాయని, పండుగకు ముందే సైనికులకు అందుతాయని చెప్పారు. దేశంలోని 14.5 లక్షల మంది సోల్జర్లకు ఈ మొత్తం అందనుంది.


