News April 11, 2025
హనుమాన్ జయంతి..భద్రతా చర్యలపై SP సమీక్ష

హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం ఆయన స్వయంగా రంగంలోకి దిగి, ఆయా శాఖల అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ర్యాలీ నిర్వహించే ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.
Similar News
News November 1, 2025
కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.
News November 1, 2025
నూతన ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించిన సీపీ

KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో నూతనంగా తీర్చిదిద్దిన ACP, CI, సిటీ రైటర్ కార్యాలయాలను CP గౌస్ అలాం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DCP వెంకటరమణ, ACPలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, CIలు కరిముల్లా ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఈ నూతన కార్యాలయాలు దోహదపడతాయని CP పేర్కొన్నారు.
News November 1, 2025
కామారెడ్డి: విద్యాశాఖ పనుల ప్రగతిపై రాష్ట్ర కార్యదర్శి సమీక్ష

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శుక్రవారం నిర్వహించిన వీసీలో KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో శుభ్రత, అసురక్షిత నిర్మాణాల కూల్చివేత, పెయింటింగ్ పురోగతిపై చర్చించారు. అలాగే UDISE డేటా, ఇంటర్నెట్ కనెక్టివిటీ, SSC, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతాలు వంటి కీలక అంశాలపై కార్యదర్శి సమీక్షించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.


