News April 12, 2025
హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలు శనివారం ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం తెలిపారు. శోభాయాత్రలకు పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు, రూమర్లు నమ్మవద్దని సూచించారు. రూమర్లను ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 15, 2025
దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News December 15, 2025
కామారెడ్డి జిల్లాలో అతి చిన్న సర్పంచ్‌గా యోగిత

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌కు చెందిన కొండ యోగిత 21 ఏళ్ల వయసులో సర్పంచిగా గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 42 ఓట్ల మెజార్టీతో గెలుపొంది జిల్లాలో అతి చిన్న వయస్కురాలైన సర్పంచిగా నిలిచారు. ఆమెకు గ్రామ ప్రజలు అభినందలు తెలిపారు.
News December 15, 2025
300 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.250. వెబ్‌సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


