News March 2, 2025

హన్మకొండలో రేపు ప్రజావాణి రద్దు

image

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు  కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా రేపటి ప్రజావాణిని రద్దు చేశామన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News January 8, 2026

పార్వతీపురం: విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ కె.మల్లిఖార్జునరావు తెలిపారు. సీతానగరం సెక్షన్ కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ ఛైర్‌పర్సన్ డా.బి.సత్యనారాయణ, మెంబర్ టెక్నికల్ సురేఖవాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు.

News January 8, 2026

గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

image

కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రెవెన్యూ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే అధికారులు బాధ్యతతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాలాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

News January 8, 2026

పర్లపల్లి: ‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

image

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలను గురువారం ఆమె సందర్శించి, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీని అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక సిలబస్‌తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 33 ప్రీప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు.