News January 8, 2026
హన్మకొండ: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పురోగతిపై సమీక్ష

పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల పురోగతిపై కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం నేషనల్ హైవేస్, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 163 జి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కోసం పూర్తయిన భూ సేకరణ, రైతులకు పరిహారం చెల్లింపు, రహదారి నిర్మాణంలో ఉన్న సమస్యలపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 25, 2026
HYD: యువతితో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్

రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకురాళ్లతో పాటు ఒక యువతిని అదుపులోకి తీసుకున్న ఘటన మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వినాయకనగర్ కాలనీలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని యువతులను రప్పిస్తూ శ్వేత, ఉమ వ్యభిచారం సాగిస్తున్నారు. ఈ సమాచారం మేరకు పోలీసులు రైడ్స్ చేశారు. ఇద్దరు నిర్వాహకురాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతిని రెస్క్యూ హోంకు పంపారు.
News January 25, 2026
రూట్ సరికొత్త రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM)లు నెగ్గిన ఇంగ్లండ్ ప్లేయర్‌గా జో రూట్ నిలిచారు. ఇవాళ శ్రీలంకతో మ్యాచులో అవార్డు అందుకోవడంతో ఈ రికార్డు చేరుకున్నారు. రూట్ 27 POTMలు అందుకోగా పీటర్సన్(26), బట్లర్(24), బెయిర్ స్టో(22), స్టోక్స్(21) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా ఓవరాల్‌గా అత్యధిక POTMలు అందుకున్న జాబితాలో సచిన్(76), కోహ్లీ(71), జయసూర్య(58) ముందు వరుసలో ఉన్నారు.
News January 25, 2026
గ్రామస్థాయిలో జగన్ సైన్యం సిద్ధం చేస్తున్నాం: పూజిత

గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా గ్రామ స్థాయి నుంచి జగన్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. శనివారం నెల్లూరు గాంధీనగర్‌లో నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారం లేకపోయినా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని కొనియాడారు.


