News December 18, 2025
హన్మకొండ జిల్లాలో ఓట్ల శాతం ఎంతంటే?

HNL జిల్లాలో 2019 జనవరిలో జీపీ ఎన్నికలు 7 మండలాల్లోని 130 జీపీలకు జరగగా, ఒంటిమామిడిపల్లి మినహా 129 జీపీలకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 2 ఎన్నికలను పోల్చితే 2019లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. అప్పట్లో ఐనవోలు మండలంలో 90% పోలింగ్ నమోదైంది. ఫేజ్ వారీగా 2019లో తొలి దశ 89.02%, 2వ దశ 86.83%, 3వ దశ 88.80% పోలింగ్ పోలింగ్ కాగా, 2025లో తొలి దశ 83.95%, 2వ దశ 87.34%, 3వ దశలో 86.44% పోలింగ్ అయింది.
Similar News
News December 19, 2025
జనగామ: కరెన్సీనోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని వినతి

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని జనగామకు చెందిన కరెన్సీపై అంబేడ్కర్ పొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురాములు ఎంపీ సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పరుశురాములు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
News December 19, 2025
ఎల్లుండి భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

U19 మెన్స్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరాయి. సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై భారత్, సెమీస్-2లో బంగ్లాదేశ్‌పై పాక్ గెలిచాయి. ఈ నెల 21న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్-1లో తొలుత SL 138-8 స్కోర్ చేయగా, IND 18 ఓవర్లలో ఛేదించింది. ఆరోన్ జార్జ్ 58, విహాన్ 61 పరుగులతో రాణించారు. SF-2లో ఫస్ట్ BAN 121 రన్స్‌కు ఆలౌట్ కాగా, పాక్ 16.3 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది.
News December 19, 2025
శ్రీశైలం చేరుకున్న భారత ఎన్నికల కమిషనర్

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం చేరుకున్నారు. దేవస్థానం అతిథి గృహం వద్ద ఆయనకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఈవో శ్రీనివాసరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.


