News January 14, 2026

హన్మకొండ జిల్లాలో తహశీల్దార్ల బదిలీ

image

జిల్లాలో ఇద్దరు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పరకాల డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ)గా ఉన్న రాజును కాజీపేట తహశీల్దార్‌గా నియమించారు. కాజీపేటలో పని చేస్తున్న బావుసింగ్‌ను పరకాల డీఏఓగా బదిలీ చేశారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వెలువడగానే వీరిద్దరూ వెంటనే తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు.

Similar News

News February 6, 2026

నేడు జోగీ రమేశ్ ఇంటికి YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో నేడు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగీ రమేశ్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భవానిపురం, గొల్లపూడి మీదగా ఇబ్రహీంపట్నం 11 గంటలకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు జోగి రమేశ్ ఇంటి వద్ద ఉంటారు. అనంతరం తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు.

News February 6, 2026

ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు: డీఈవో

image

విద్యా హక్కు చట్టం ప్రకారం కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించినట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆధార్ వివరాలతో cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఈ ప్రవేశాలు కల్పిస్తారు.

News February 6, 2026

మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో వేధింపులు: నటి

image

మూడేళ్లుగా తాను SMలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పోస్ట్ చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని IGలో ఆమె కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొనే, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.