News February 24, 2026

హన్మకొండ జిల్లాలో 38 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు

image

హన్మకొండ జిల్లాలో జనవరిలో నిర్వహించిన రోడ్డు భద్రతావారోత్సవాల్లో భాగంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారితో పాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన 38 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు హన్మకొండ ఆర్టీఓ అధికారులు మంగళవారం తెలిపారు. అధిక లోడ్‌తో వెళ్తున్న ఓ వాహన డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 25, 2026

రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న KTR

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News February 25, 2026

YELLOW ALERT: రేపు వర్షాలు

image

TG: రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది.

News February 25, 2026

ఇంటర్మీడియట్ పరీక్షలపై కలెక్టర్–ఎస్పీ సంయుక్త పర్యవేక్షణ

image

గద్వాల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. ఈ నేపథ్యంలో గద్వాల్ పట్టణంలోని జ్ఞానప్రభ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.