News February 12, 2025
హన్మకొండ: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

హన్మకొండ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.
Similar News
News February 11, 2026
మేడ్చల్: ఎంసీపల్లిలో ఓటేసిన 102 ఏళ్ల ఎల్లమ్మ

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 102 ఏళ్లున్న దాసరి ఎల్లమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎందుకు వేయాలని భావిస్తున్న ఎందరికో ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఎల్లమ్మ చెబుతున్నారు.

ఇస్త్రీ చేస్తూ రూ.2లక్షలకు పైగా సంపాదన.. ట్వీట్ వైరల్!

సామాన్య ఇస్త్రీ షాపు యజమాని సంపాదన చూసి ఓ మహిళ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిరోజూ వందలాది బట్టల ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా ఆ దంపతులు సంపాదిస్తున్నారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఖర్చులు పోను రూ. 2.37 లక్షలు పొందుతున్నారని, ఇది ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలిపారు. ఏ వృత్తి అయినా అంకితభావంతో చేస్తే IT కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని వీరు నిరూపిస్తున్నారు.