News September 12, 2025
హన్మకొండ: స్నేహితుడి హత్య కేసులో జీవిత ఖైదు

డబ్బుల విషయంలో స్నేహితుడిని హత్య చేసిన కేసులో నిందితుడు పల్టియా రమేశ్‌కు హన్మకొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి బి.అపర్ణ దేవి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2023 సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘటనలో రమేశ్ తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. కోర్టు రమేశ్‌కి జీవితఖైదుతో పాటు రూ.1000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Similar News
News September 12, 2025
రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.
News September 12, 2025
రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈఓ

గత నెల 18న వర్షాల కారణంగా ప్రకటించిన సెలవుకు బదులుగా ఈ నెల 13వ తేదీన (రెండో శనివారం) పాఠశాలలు తెరిచి ఉంటాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించినట్లు డీఈఓ రమేశ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓలకు, ఎంఈఓలకు ఆదేశాలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
News September 12, 2025
ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.