News December 14, 2025
హన్మకొండ: 19.57% శాతం పోలింగ్ @9AM

జిల్లాలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. 9 గంటల సమయానికి జిల్లా మొత్తం మీద 19.57% పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వేలేరులో అత్యధికంగా 22.55% పోలింగ్ నమోదు కాగా, ధర్మసాగర్‌లో 21.18% ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఐనవోలులో 18.52%, హసన్‌పర్తిలో 17.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News December 15, 2025
రేవంత్ ప్రభుత్వంపై కవిత విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కవిత విమర్శలు చేశారు. ‘#AskKavitha’లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ‘వాగ్దానాలు నెరవేరలేదు. కమిట్మెంట్స్ అన్నీ విఫలమయ్యాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. హీరో రామ్ చరణ్ గురించి మరొకరు అడగ్గా ‘ఆయన ఎంతో వినయంగా ఉంటారు. గొప్ప డాన్సర్. కానీ నేను చిరంజీవి అభిమానిని కాబట్టి ఆయనే గొప్ప’ అని బదులిచ్చారు.
News December 15, 2025
చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.
News December 15, 2025
మిరపలో పూత, కాయతొలుచు పురుగు నివారణ

ఈ సమయంలో మిరపలో పూత పురుగు, కాయ తొలుచు పురుగు ఉద్ధృతి కూడా ఉంటుంది.
☛ మిరపలో పూత పురుగు నివారణకు లీటరు నీటికి కార్బోసల్ఫాన్ 1.6ml మందును 1500 పి.పి.ఎం వేపనూనె 5mlతో కలిపి పిచికారీ చేయాలి.
☛ మిరపలో కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ 0.5 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్+ ఫిప్రోనిల్ 1.2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి.


