News December 3, 2025

హన్మకొండ: 66 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్

image

జిల్లాలో ఈసారి జరగబోయే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దశల్లో పోలింగ్ జరగనున్న మొత్తం 1986 పోలింగ్ స్టేషన్లలో (PS) దాదాపు 586 స్టేషన్లను వెబ్ కాస్టింగ్ కోసం ఎంపిక చేశారు.
దశ-I: 166 (658 PS)
దశ-II: 208 PS (694 PS)
దశ-III: 212 PS (634 PS) కేంద్రాల్లో పర్యవేక్షణ కోసం 66 మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

Similar News

News December 3, 2025

వరంగల్: మూడు రోజులుగా స్థిరంగానే పత్తి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా పత్తి ధర స్థిరంగా ఉంటోంది. సోమవారం, మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలకగా.. బుధవారం సైతం అదే ధర పలికినట్లు అధికారులు చెప్పారు. చలికాలం నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ పత్తిని మార్కెటు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.

News December 3, 2025

వరంగల్: రెండో విడతకు జోరుగా నామినేషన్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వారీగా మహబూబాబాద్‌లో అత్యధికంగా 1,118 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. వరంగల్‌లో 830, జనగామలో 551, హనుమకొండలో 524, భూపాలపల్లిలో 519, ములుగులో 288 నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 3, 2025

ADB: వార్డు అభ్యర్థులే దిక్కులేరాయే..!

image

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు విభజించు, పాలించు సూత్రాన్ని అవలంబిస్తున్నారు. భీంపూర్ మండలంలోని ఓ గ్రామంలో కొందరికి వార్డు మెంబర్ల అభ్యర్థులు లేకపోవడంతో తమకు సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల్లో ఐదారుగురితో వార్డుల్లో నామినేషన్లు వేయించారు. కుటుంబాలను విడగొడుతూ తమకు మద్దతుదారులు ఉన్నారని వర్గాలు ఏర్పరుస్తున్నారు.