News March 31, 2025

హన్మకొండ: GREAT.. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన సోని

image

హనుమకొండ టైలర్స్ స్ట్రీట్‌కు చెందిన తోట దామోదర్-జ్యోతిల కుమార్తె తోట సోని గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల జాబితాలో తోట సోనికి రాష్ట్ర స్థాయిలో 203వ ర్యాంకు, మల్టీ జోన్ స్థాయిలో 93వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని తోట సోని తెలిపారు.

Similar News

News February 27, 2026

నిర్మల్: మహిళా చేతికి బస్ స్టీరింగ్

image

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు బస్సులను పంపిణీ చేయనుంది. వీటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.69,468 ఆదాయం లభించనుంది. రూ.36 లక్షల బస్సు విలువలో సేర్ఫ్ ద్వారా రూ.30 లక్షలు, బ్యాంకు ద్వారా రూ.6 లక్షలు రుణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరిగి, వారు స్వయం సమృద్ధి సాధించనున్నారు.

News February 27, 2026

పోలీస్ భవనాల ప్రారంభానికి డీజీపీ.. ఖమ్మంలో హై అలర్ట్

image

రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్‌ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 27, 2026

శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

image

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.