News March 20, 2025

హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్

image

పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్‌లో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. వెంకటేష్ నిత్యం తాగి వచ్చి తల్లి లక్ష్మమ్మ, భార్య సబితను వేధించేవాడు. వేధింపులకు తాళలేక ఈనెల 19న తల్లి, భార్య ఇద్దరు కలిసి ఐరన్ రాడ్‌తో అతడి చెవి భాగాన కొట్టి చంపారు. నేరం ఒప్పుకోవడంతో వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Similar News

News March 21, 2025

అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.

News March 21, 2025

నాగర్ కర్నూల్: ‘జైలులో ఖైదీలు ఎలా ఉన్నారు..?’

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సబ్ జైలును గురువారం జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ, జిల్లా జడ్జి సబిత సందర్శించారు. జైల్లో ఖైదీలు ఎలా ఉన్నారు.. వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఖైదీలకు వండే ఆహార పదార్థాలను, వంటగదిని పరిశీలించారు. పిల్లలకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు.

News March 21, 2025

తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

image

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

error: Content is protected !!