News March 26, 2025
హన్మాజీపేట: నవోదయ సీటు సాధించిన విద్యార్థిని

వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన నగరం గాయత్రి నవోదయ పరీక్ష ఫలితాల్లో సీట్ సాధించింది. గాయత్రి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. చదువుపై దృష్టి పెడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. గాయత్రికి నవోదయలో సీటు రావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 6, 2025
జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||3||
వసిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, పరమ పవిత్రుడు, గొప్ప తపస్సు సంపద కలిగినవాడు, శుకమహర్షి తండ్రి అయిన ఆ వేదవ్యాస మహర్షికి మనం నమస్కరించాలి. ఆ వ్యాసుడి గొప్ప వంశాన్ని, పవిత్రతను స్మరించుకొని, పూజించడం వలన ఆయనలా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 6, 2025
పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.
News November 6, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసుల బదిలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో 15 మంది పోలీసులకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరంతా బదిలీ అయిన స్థానాల్లో 3 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


