News February 10, 2025

హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

image

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 17, 2025

గుండాలలో 1,344 ఓట్ల తేడాతో విజయం

image

గుండాల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు దేవనబోయిన ఐలయ్య 1,344 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కోన్నారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

News December 17, 2025

వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

image

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

News December 17, 2025

బాంబ్ డిస్పోజల్ టీంకు రెండు రోజుల శిక్షణ

image

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో BD టీం (బాంబ్ డిస్పోజల్ టీం)కు సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్‌మెంట్ కోర్స్‌ను ప్రారంభించారు. ఈ కోర్స్ పోలీస్ టీమ్ సభ్యుల ఆచరణాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. BD టీం సభ్యులకు ఆధునిక సాంకేతికతలు, బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ పద్ధతులపై శిక్షణలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.