News January 9, 2025
హలో అనంతపురం!
అనంతపురంలో నేడు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు యాంకర్ సుమ సిద్ధమయ్యారు. హలో అనంతపురం అంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘మీ ప్రశ్నలు, ఉల్లాసకరమైన మీమ్‌లను పంపండి. వాటిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా మాస్ ఆఫ్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డాకు టీమ్‌ను అడిగి సమాధానాలు రాబట్టేందుకు నా వంతు కృషి చేస్తా’ అని రాసుకొచ్చారు. కాగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభంకానుంది.
Similar News
News January 9, 2025
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకే రద్దు చేశాం: బాలకృష్ణ
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనంతపురంలో ఈ రోజు జరగాల్సిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. ‘తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విషాధ సమయంలో ఈవెంట్ జరపడడం సముచితం కాదు. అందుకే రద్దు చేశాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది’ అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ తెలిపారు.
News January 9, 2025
మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు
తిరుపతిలో తొక్కిసలాట కారణంగా మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన రద్దయింది. బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ అనంతపురంలో జరిగే ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. సినీ ప్రముఖులతోనే ఈవెంట్ యథాతథంగా కొనసాగనుంది.
News January 9, 2025
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి తెలిపారు. అందులో ఎఫ్ఎన్‌వో 18, సానిటరీ అటెండర్, వాచ్‌మెన్ 11 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు ఈనెల 20వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.