News January 22, 2025

హలో అనంతపూర్.. వచ్చేస్తున్నాం: బాబీ

image

అనంతపురంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ జరగనుది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తరలివస్తోంది. ఈ క్రమంలో హలో అనంతపూర్.. అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. ‘డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకి వచ్చేస్తున్నాం. ఈ సాయంత్రం అంతా కలుద్దాం’ అని పోస్ట్ పెట్టారు. ఆయనతో పాటు బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా, తమన్, నిర్మాత నాగ వంశీ, సినీ ప్రముఖులు రానున్నారు.

Similar News

News October 28, 2025

‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

image

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 28, 2025

అనంత: జిల్లా అధికారులతో సమావేశం

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో షెడ్యుల్డ్ కులాల సంక్షేమం కొరకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ జగదీశ్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ అధ్యక్షులు కుమార్ రాజావర్ల పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కావలి గ్రీష్మ, ఎమ్మెస్ రాజు, విజయ్ కుమార్ బిఎన్, రోషన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

News October 27, 2025

అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

image

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.