News April 19, 2025
హాజీపూర్: ‘ప్రజా సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది’

ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయిందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హాజీపూర్ మండలంలోని ర్యాలీ నుంచి గడ్పూర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఆమె సూచించారు.
Similar News
News April 20, 2025
IPL: CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

CSK ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ధోనీ సేన NRR -1.276గా ఉంది. ఇది మెరుగవ్వాలంటే భారీ తేడాలతో మ్యాచులు గెలవాలి. CSK ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అనుకుంటున్నారా? మీ కామెంట్.
News April 20, 2025
‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్‌లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో దిలీప్ రాజా మాట్లాడుతూ త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.
News April 20, 2025
భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.