News March 17, 2025

హాట్ టాపిక్‌గా కేటీఆర్, మల్లన్న భేటీ

image

కేటీఆర్, హరీశ్, తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పనిప్పులా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న వారిని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.

Similar News

News November 4, 2025

మంచిర్యాల జిల్లా జట్టుకు మొదటి స్థానం

image

దండేపల్లి మండలం రెబ్బనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి SGF అండర్-14 వాలీబాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో 4 జిల్లాల నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట స్థాయికి పోటీలకు ఎంపిక చేసినట్లు SGF సెక్రటరీ యాకూబ్ తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

News November 4, 2025

ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

image

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.

News November 4, 2025

ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

image

తూప్రాన్ గురుకులంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరికిషన్, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 150 మంది హాజరు కాగా, 15 మంది పురుషులు, 15 మంది మహిళలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.