News March 6, 2026

హాట్ టాపిక్‌గా విజయ్-త్రిష వ్యవహారం!

image

TVK ఛీప్ విజయ్ త్రిషతో కలిసి కనిపించడంతో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. విజయ్ భార్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని.. విజయ్ <<19306972>>త్రిషతో<<>> జీవితాన్ని పంచుకునే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే 2015లోనే త్రిషకు చెన్నైకి చెందిన వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయింది. ఆ తర్వాత 5 నెలలకే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అంతకుముందు రానా దగ్గుబాటితో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి.

Similar News

News April 14, 2026

ట్రంప్ వర్సెస్ పోప్: ఏంటి గొడవ?

image

ట్రంప్, పోప్ లియో XIV మధ్య వివాదం ముదిరింది. నేరాల విషయంలో పోప్ ‘వీక్’గా ఉన్నారని ట్రంప్ విమర్శించారు. తనని తాను ‘యేసుక్రీస్తు’గా చిత్రీకరించుకున్న ఫొటోను షేర్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పోప్ స్పందిస్తూ.. ట్రంప్ ప్రభుత్వానికి తాను భయపడనని, సువార్త సందేశాన్ని గట్టిగా వినిపించడం తన బాధ్యతని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని ఆపాలంటూ పోప్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.

News April 13, 2026

మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం!

image

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ICC రికార్డు స్థాయిలో ₹82 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించింది. 2024తో పోలిస్తే ఇది 10% అధికం. విజేతగా నిలిచిన టీమ్‌కు ₹21.9 కోట్లు, రన్నరప్‌కు ₹10.9 కోట్లు దక్కనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం ₹2.3 కోట్ల గ్యారంటీ ప్రైజ్ మనీ లభించనుంది. జూన్ 12 నుంచి 12 జట్లతో జరగనున్న ఈ మెగా టోర్నీలో మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

News April 13, 2026

హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి: హైకోర్టు

image

TG: తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. ‘హైడ్రాకు ఇప్పటివరకు విధివిధానాలు లేవు. కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. చెరువులు, రోడ్లు, పార్కులు ఆక్రమిస్తే కూల్చివేయాలి. నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారం కూల్చివేస్తున్నారు’ అని మండిపడింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అమీన్‌పూర్‌లో చేపట్టిన కూల్చివేతల వీడియోలను జడ్జికి సమర్పించారు.