News December 16, 2025

హాట్ మెటల్ ఉత్పత్తిలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రికార్డ్

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం 6AM నుంచి సోమవారం 6AM వరకు బ్లాస్ట్‌ఫర్నేస్ 1, 2, 3 విభాగాల్లో 21,012 టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి జరిగింది. ఒక రోజులో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ ఏడాది NOV 30న 20,440 టన్నుల ఉత్పత్తి జరిగింది. సంస్థ అభివృద్ధి పట్ల తమకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని ఉద్యోగ, కార్మిక వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.

Similar News

News April 13, 2026

పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

image

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.

News April 13, 2026

రేపు CBSE టెన్త్ ఫలితాలు?

image

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రంలోపు బోర్డు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. https://www.cbse.gov.in/లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి.

News April 13, 2026

ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

image

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.