News December 28, 2025
హాదీ హంతకులు భారత్‌లోనే ఉన్నారు: ఢాకా పోలీసులు

బంగ్లా పొలిటికల్ యాక్టివిస్ట్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు. ‘ఫైసర్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ స్థానికుల సాయంలో మైమన్‌సింగ్‌లో బార్డర్ క్రాస్ చేశారు. భారత్‌లో వారిని పూర్తి అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నారు. సామీ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయాలో తురా సిటీకి తీసుకెళ్లారు. భారత అధికారులను సంప్రదిస్తున్నాం’ అని అడిషనల్ కమిషనర్ నజ్రూల్ తెలిపారు.
Similar News
News December 29, 2025
సాగులో సాంకేతిక పరిజ్ఞానం.. కులవృత్తులపై ప్రభావం

వ్యవసాయంలో యాంత్రీకరణ సాగును లాభసాటిగా మార్చినప్పటికీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం కొన్ని చేతి వృత్తుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసింది. నాగలి, ఎడ్లబండి చక్రాలు, పట్టి వేయడం, దంతె, గొర్రు, మేడి వంటి పనిముట్లను తయారు చేస్తూ అనేక మంది జీవించేవారు. ట్రాక్టర్లు, ఇతర యంత్రాల వినియోగం పెరగడంతో వీటిని వాడే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా కొన్ని కులవృత్తులకు ఉపాధి కరవయ్యే పరిస్థితి నెలకొంది.
News December 29, 2025
నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 26,018 వద్ద, సెన్సెక్స్ 104 పాయింట్లు కుంగి 84,936 వద్ద ఉన్నాయి. టాటా స్టీల్, ఎటర్నల్, టైటాన్, టెక్ మహీంద్రా, TMPV షేర్లు లాభాల్లో.. అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, HCL టెక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
News December 29, 2025
అసహనంతో ఎన్నో అనర్థాలు

ప్రస్తుత కాలంలో చాలామందిలో నిరాశ, నిస్పృహ, అసహనం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అసహనానికి గురవడం వల్ల ప్రశాంతత తగ్గడం, అందరిలో పరువు పోవడం తప్ప వేరేమీ జరగదు. దీంతోపాటు అసహనం వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురై బీపీ, షుగర్ వంటి వ్యాధులు రావడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఆలోచించి సమస్యకు పరిష్కారం చూడాలని సూచిస్తున్నారు.


