News May 4, 2024

హామీలను స్టాప్ పేపర్‌పై రాసిచ్చిన MLA అభ్యర్థి

image

ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్‌పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య ప్రకటించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

Similar News

News April 21, 2025

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వొద్దు: కలెక్టర్

image

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదని, అటువంటి ఎండార్స్మెంట్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను స్వీకరించడం, వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

News April 21, 2025

తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

News April 21, 2025

తూ.గో: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

error: Content is protected !!