News October 19, 2025
హార్బర్ సముద్ర బీచ్‌లో పటిష్ఠ బందోబస్తు: ఎస్ఐ

నిజాంపట్నం హార్బర్ సముద్ర తీరంలో యాత్రికుల భద్రతకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ కందుల తిరుపతిరావు తెలిపారు. శనివారం డ్రోన్ కెమెరాల ద్వారా బీచ్ పరిసరాలను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని అన్ని బీచ్‌ల వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బీచ్‌లో మద్యం తాగడం, నిషేధిత ప్రాంతాల్లో తిరగడం పూర్తిగా నిషేధమన్నారు. నింబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 19, 2025
జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
News October 19, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీచ్ కానీ టార్గెట్..!

ఉమ్మడి KNR జిల్లాలో 2025-27కు గాను వైన్ షాప్ టెండర్ల ద్వారా రూ.380 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 287 వైన్ షాపులకు గాను 7188 దరఖాస్తుల ద్వారా రూ.215.64 కోట్ల ఆదాయం వచ్చింది. క్రితంసారి 10,734 దరఖాస్తులకు గాను 214.68 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి 3,546 దరఖాస్తులు తక్కువగా వచ్చినా రూ.కోటి 4 లక్షల ఆదాయం పెరిగింది. ఈనెల 23లోపు టార్గెట్ రీచ్ అవుతోందో, కాదో వేచి చూడాలి.
News October 19, 2025
డ్యూడ్ మూవీకి కళ్లుచెదిరే కలెక్షన్స్

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. తొలిరోజు రూ.22 కోట్లు కొల్లగొట్టిన ‘డ్యూడ్’ రెండో రోజు అంతకుమించి రూ.23 కోట్లు రాబట్టింది. చిన్న హీరో మూవీకి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం విశేషం.