News March 16, 2026
హార్ముజ్‌పై ఆశలు.. మార్కెట్లకు లాభాల జోష్

గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లకు ఈరోజు భారీ లాభాలు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద క్లోజ్ అవగా నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది. కొనుగోళ్లు పెరగడం, క్రూడ్ లోడ్‌తో భారతీయ నౌకలు వస్తుండటం, హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఇతర నౌకలను ఎస్కార్ట్ చేసేందుకు US ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం మార్కెట్లకు రిలీఫ్‌ను ఇచ్చింది.
Similar News
News April 14, 2026
వేటకు విరామం.. త్వరలో అకౌంట్లోకి రూ.20,000

AP: నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగనుంది. చేపల పునరుత్పత్తికి వీలుగా ఏటా ఈ విరామాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 61 రోజులపాటు వేటకు దూరంగా ఉండే మత్స్యకారులు ఇబ్బంది పడకుండా త్వరలో రూ.20వేల చొప్పున అకౌంట్లలో జమ చేయనుంది. ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది దాదాపు 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది.
News April 14, 2026
మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్‌కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
News April 14, 2026
నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.


