News March 11, 2026
‘హార్ముజ్’లో నావల్ మైన్స్? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌ను ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్స్ ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మిలిటరీ చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కాగా ‘హార్ముజ్’ గుండా ఆయిల్ ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేసినట్లు US నేవీ SMలో పోస్ట్ చేసి డిలీట్ చేయగా, ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
Similar News
News April 5, 2026
టాస్ గెలిచిన చెన్నై

IPL: RCBపై చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచు జరగనుంది.
CSK: రుతురాజ్ (C), శాంసన్, ఆయుష్, సర్ఫరాజ్, ప్రశాంత్ వీర్, దూబే, నూర్ అహ్మద్, ఓవర్టన్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్.
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, పాటిదార్(C), జితేశ్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, జాకబ్ డఫీ.
News April 5, 2026
సమ్మర్‌లో కుక్కలు డేంజర్.. ఎందుకో తెలుసా?

వేసవిలో కుక్కలు కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో అసౌకర్యం వల్ల చిరాకు పెరిగి, ఎవరు దగ్గరకు వచ్చినా దాడి చేసే అవకాశం ఉంది. నీరు దొరకకపోతే డీహైడ్రేషన్‌కు గురై దూకుడుగా ప్రవర్తిస్తాయి. వేసవిలో చాలా కుక్కలు పిల్లలను కంటాయి. ఆ సమయంలో పిల్లల రక్షణ కోసం ఎవరు దగ్గరకు వచ్చినా ప్రమాదంగా భావించి కరుస్తాయి. కుక్కల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
News April 5, 2026
‘PSL నం.1 అవుతుంది’.. PCB ఛైర్మన్ డబ్బా!

కేవలం 2 వేదికల్లో, <<19452212>>ఖాళీ స్టేడియాల్లో<<>> నిర్వహిస్తున్న PSLపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా PSL మారిందని బోర్డు మీటింగ్‌లో గొప్పలకు పోయారు. ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అవుతుందని అన్నారు. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తోందని, గ్లోబల్ స్టేజ్‌పై పాక్ క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.


