News March 12, 2026

హార్ముజ్ జలసంధి మూసే ఉండాలి: మొజ్తబా ఖమేనీ

image

హార్ముజ్ జలసంధి మూసే ఉండాలని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. ‘హార్ముజ్ మూసివేత కొనసాగుతుంది. శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్యలు తప్పవు’ అని చెప్పారు. గల్ఫ్‌లోని US స్థావరాలను మూసేయాలని, లేదంటే అటాక్స్ చేస్తామని స్పష్టంచేశారు. శత్రువుల నుంచి నష్టపరిహారం తీసుకుంటామని, లేదంటే వాళ్ల ఆస్తులు ధ్వంసం చేస్తామన్నారు. దేశంపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తన తొలి ప్రసంగంలో హెచ్చరించారు.

Similar News

News April 14, 2026

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’.. టీజర్ పోస్టర్

image

‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌లో భాగంగా తెరకెక్కిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ నుంచి కొత్త టీజర్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. జులై 31న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్లను షురూ చేశారు. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహిస్తుండగా పీటర్ పార్కర్ పాత్రలో మరోసారి టామ్ హాలండ్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన <<19417934>>ట్రైలర్<<>> మూవీపై అంచనాలను పెంచింది.

News April 14, 2026

ఏపీ నుంచి ధాన్యం రాకుండా నిషేధాజ్ఞలు

image

TG: వరి ధాన్యం సేకరణ ప్రారంభమైన నేపథ్యంలో GOVT ఆంధ్ర వరిపై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి TGలోకి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో సిబ్బందిని మోహరించారు. సన్నరకం వరిపై ₹500 బోనస్ చెల్లిస్తుండడంతో కొందరు వ్యాపారులు AP ధాన్యాన్ని తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. దీంతో ఏపీ రైతులు తమ వరిని ఆ రాష్ట్రంలోనే అమ్ముకోవాలని సూచిస్తూ TGలోకి రాకుండా ఏర్పాట్లు చేశారు.

News April 14, 2026

పెళ్లిపై హీరో రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన సింగిల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి తనకు ఏకాంతం అలవాటని, అది ఎంతో ప్రశాంతతను ఇస్తుందని తెలిపారు. షూటింగ్స్‌లో సందడి ఉన్నా, తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నానని రామ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో తోడు దొరికితే ఆహ్వానిస్తానని, లేదంటే ఒంటరిగా మరింత సంతోషంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.