News December 22, 2025
హార్మోనల్ ఇంబాలెన్స్‌ని ఎలా గుర్తించాలంటే?

మన శరీరంలోని హార్మోన్లు మానసిక స్థితి, శక్తి, జీవక్రియ, నిద్ర, ఆకలి, పునరుత్పత్తి ఆరోగ్యం ఇలా అన్నిటిని నియంత్రిస్తాయి. అయితే ఇవి అస్తవ్యస్తం అవ్వడం వల్ల మహిళల్లో గర్భం, PCOS, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. వీటితో పాటు నిరంతర అలసట. ఆకస్మిక బరువు పెరగడం లేదా తగ్గడం, మొటిమలు, జుట్టు రాలడం, మానసిక అనారోగ్యాలు, అధిక నిద్ర, జీర్ణ సమస్యలు, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 23, 2025
కిచెన్ టిప్స్

– స్టీల్ వాటర్ బాటిల్స్‌ను శుభ్రం చేయాలనుకుంటే.. టేబుల్ స్పూన్ నిమ్మరసం, బేకింగ్ సోడా, నీళ్లు పోసి బాటిల్ మూత పెట్టి 15నిమిషాలు వదిలేయాలి. తర్వాత బాటిల్‌ను బాగా కదిపి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
– నిమ్మకాయ చెక్కకు ఉప్పు కలిపి, రాగి పాత్రలపై రుద్దితే వాటికి అంటుకున్న జిడ్డు సులువుగా పోతుంది.
– పచ్చిమిర్చి కోసిన వెంటనే చేతులకు పంచదార అప్లై చేసి, రెండు నిమిషాల తర్వాత చేతులు కడిగితే మంట తగ్గుతుంది.
News December 23, 2025
యుద్ధ విద్య నేర్చుకుంటున్న మహేశ్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ కోసం సూపర్ స్టార్ మహేశ్‌బాబు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్న ప్రిన్స్.. కేరళకు చెందిన పురాతన యుద్ధ విద్య ‘కళరిపయట్టు’లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ట్రైనర్ హరికృష్ణన్ ఆయనకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మూవీపై భారీగా అంచనాలను పెంచాయి.
News December 23, 2025
క్లుప్తంగా చెప్పాలంటే ఇదే రైతు జీవితం..

వర్షం కాన రాదు.. కరవు పోదు.. కష్టం తరగదు.. ప్రకృతి తీరు మారదు.. బ్యాంకు రుణం తీరదు.. కన్నీళ్ల తడి ఆరదు.. రేపటి మీద ఆశ చావదు.. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాత జీవితం ఇదే. చేతి నిండా అప్పులున్నా, పేదరికం పగబట్టినా, నిరాశ ఆవహిస్తున్నా, నిస్సహాయుడిగా మిగిలినా.. తాను నమ్ముకున్న భూమి ఏనాటికైనా తన కష్టం తీరుస్తుందన్న నమ్మకంతో బతికే ఆశాజీవి ‘రైతు’ మాత్రమే. అన్నదాతలకు ‘జాతీయ రైతు దినోత్సవ’ శుభాకాంక్షలు.


