News February 26, 2026
హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం: CM రేవంత్

TG: హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని గ్రూప్-1,2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో CM రేవంత్ వెల్లడించారు. ‘ఇక్కడి నుంచి హార్వర్డ్‌కు వెళ్లేందుకు చాలామందికి కష్టమవుతోంది. అందుకే MCHRD-హార్వర్డ్ మధ్య ఓ ఒప్పందం చేసుకుంటున్నాం. వాళ్లే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెబుతారు’ అని రేవంత్ వివరించారు. ఇక ఆఫీసర్లంతా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు.
Similar News
News February 27, 2026
సీక్రెట్‌గా భారత్‌కు ట్రంప్ దూత!

గ్లోబల్ టారిఫ్స్ చెల్లవని కొట్టేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు భారతే వచ్చి ‘సారీ’ చెబుతుందన్న US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్ ఇప్పుడు స్వయంగా ఢిల్లీకి వచ్చి పీయూష్ గోయల్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. కోర్టు తీర్పుతో ట్రంప్ బార్గెయినింగ్ పవర్ తగ్గడంతో భారత్ తన వాషింగ్టన్ పర్యటనను వాయిదా వేసి పట్టు సాధించింది. దీంతో కంగారుపడ్డ ట్రంప్ ‘గేమ్స్ ఆడకండి’ అని వార్నింగ్ ఇచ్చారు.
News February 27, 2026
ఇజ్రాయెల్‌కు అమెరికా స్టెల్త్ విమానాలు

ఇరాన్‌తో అణు చర్చల వేళ అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్‌డ్ F-22 రాప్టర్ స్టెల్త్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు పంపింది. బ్రిటన్ నుంచి బయలుదేరిన 12 విమానాలు ఇప్పటికే అక్కడ ల్యాండయ్యాయి. ఒకవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో చర్చలు సాగుతున్నా అమెరికా మాత్రం తన మిలిటరీ బలాన్ని పెంచుతూనే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్సామ్‌ను నిలువరించడమే లక్ష్యంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను మోహరించింది.
News February 27, 2026
వదినమ్మకు ఆనంద్ దేవరకొండ అదిరిపోయే వెల్కమ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన వదినకు వెల్కమ్ చెప్పారు. ‘ఫ్యాన్స్ తనను కలిసినప్పుడల్లా ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది’ అని ఆనంద్ సరదాగా పేర్కొన్నారు. అత్యంత దయగల, పాజిటివ్ పర్సన్ వదినగా రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ జంట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఆకాంక్షించారు.


