News January 12, 2026
హార్సిలీహిల్స్‌లో లోయలో పడిన యువకుడు

హార్సిలీహిల్స్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. పలమనేరుకు చెందిన పురుషోత్తం తిరుపతి SVUలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి హార్సిలీహిల్స్‌కు వచ్చాడు. గాలిబండ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడిపోయాడు. దట్టమైన పొగ మంచు కారణంగా చాలాసేపటి తర్వాత చెట్ల మధ్యలో అతడిని గుర్తించారు. బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 22, 2026
విశాఖ: GCC నూతన ఎండీగా శోభిక బాధ్యతలు

విశాఖ గిరిజన సహకార సంస్థ (GCC) నూతన వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్. శోభిక గురువారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన వెంటనే ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించి, అరకు కాఫీ మార్కెటింగ్, గిరిజనుల జీవనోపాధి మెరుగుదలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సంస్థ అభివృద్ధికి సిబ్బంది అంతా నిబద్ధతతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనస్వాగతం పలికారు.
News January 22, 2026
EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News January 22, 2026
‘పక్క స్థలం కొంటున్నారా? భయం వద్దు!’

తూర్పు/ఉత్తరం వైపు ఇల్లు ఉన్నవారు పడమర, దక్షిణం వైపు స్థలాన్ని కొనకూడదనే అపోహ ఉంది. అయితే ఆ అపోహ తప్పని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. వాస్తు నియమాల ప్రకారం.. ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని చెబుతున్నారు. ‘అయితే కొత్తగా కలిసిన స్థలంలో నైరుతి భాగం ఎత్తుగా ఉంచి, తూర్పు/ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదిలేలా మార్పులు చేయాలి. అది గొప్ప ఫలితాలను ఇస్తుంది’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


