News January 4, 2026

హాల్టికెట్లలో మార్పులుంటే చేసుకోవచ్చు: డీఐఈవో

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.

Similar News

News January 23, 2026

వరంగల్ RJDగా లక్ష్మణుడు బాధ్యతల స్వీకరణ

image

మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాదులో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మణుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న RJD ఉప్పుల శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం లక్ష్మణుడిని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. వరంగల్ RJDగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మణుడికి మార్కెటింగ్ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

News January 21, 2026

WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

News January 21, 2026

వరంగల్‌: ‘స్కాలర్‌షిప్‌ విద్యార్థులు ఆధార్‌ లింకు చేసుకోవాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.