News February 24, 2026
హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతి: వనపర్తి DIEO

హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యార్థులు మీసేవ, ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ సూచించారు.
Similar News
News February 25, 2026
BREAKING: పాలమూరు: ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. MBNR జిల్లా నవాబ్‌పేట్(M) చాకలిపల్లికి చెందిన పురుషోత్తం(19) యన్మంగండ్లలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో చదువుపై శ్రద్ధ వహించడం లేదని కుటుంబీకులు ఇటీవల అతడిని మందలించారు. దీంతోపాటు ఇటీవల అతడి లవ్ కూడా ఫెయిలైందని మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
News February 25, 2026
HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.
News February 25, 2026
త్వరలో హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నాం: మంత్రి

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మొత్తం 35 డిపార్ట్‌మెంట్లతో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించబోతున్నామని, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కేన్సర్ పేషెంట్లకు చికిత్స అందించే విధంగా అత్యాధునిక Linac, Radiology సేవల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.


