News March 18, 2025
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన నర్మాల మహిళ

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పి.లావణ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోన్-3 ఉమెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. లావణ్య ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి కేజీబీవీలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. గ్రూప్4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగం చేస్తూనే హాస్టల్ వెల్ఫేర్ జాబ్‌కు ప్రిపేరై జాబ్ కొట్టింది.
Similar News
News March 18, 2025
ఆసిఫాబాద్-ఉట్నూర్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి: MLA

ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వెళ్లే హస్నాపూర్ ప్రధాన రహదారి చాలా అధ్వానంగా మారిందని.. ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కెరమెరి ఘాట్లో నిత్యం వాహనాలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఫారెస్ట్ క్లియరెన్స్ చేయాలని కోరారు. 6 కిలోమీటర్లు ఉన్న సింగిల్ రోడ్డుకు వెడల్పు పెంచాలని కోరారు.
News March 18, 2025
సత్యసాయి: ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు దొర్లరాదు

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.
News March 18, 2025
ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్‌ను మరోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, ఇవాళ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.