News February 8, 2025

హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలి: భద్రాద్రి కలెక్టర్

image

ఆశ్రమ గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం పాల్వంచ పట్టణంలోని గురుకుల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి, మాట్లాడారు. డార్మిటరీ డోర్లు, కిటికీలు, తాగునీటి సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళికలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 5, 2025

జీవ ఎరువులతోనే భూమాతకు రక్షణ: కలెక్టర్

image

రసాయన ఎరువుల బదులు జీవ ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) విరివిగా వాడేలా రైతుల్ని చైతన్య పరచాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులకు సూచించారు. బుధవారం జరిగిన జిల్లాస్థాయి భూమాత రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 5, 2025

కోస్గి: సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలో ఇదీ పరిస్థితి..!

image

కోస్గి కేంద్రంలో జరుగుతున్న అండర్-17 హ్యాండ్‌బాల్ జట్ల ఎంపికకు వచ్చిన క్రీడాకారులు అసౌకర్యానికి గురయ్యారు. వారికి భోజనం చేసేందుకు సరైన స్థలం లేక డ్రైనేజీ పక్కన కూర్చుని తినాల్సి వచ్చింది. సీఎం ఇలాకా.. క్రీడల మంత్రి జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలోనైనా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

News November 5, 2025

FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

image

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.