News March 8, 2025
హాస్టళ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులకు సంబందించిన పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం సంబంధిత అధికారులతో సమీక్షించారు. వసతి గృహాల మరమ్మతులకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలను నిర్దేశించిన గడువులోపు పంపాలని ఆదేశించారు.
Similar News
News July 5, 2025
రాజమండ్రిలో మహిళ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

రాజమండ్రికి చెందిన మహిళ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. 2013 డిసెంబర్ 2న లక్ష్మీవారపు పేటకు చెందిన నాగభారతిని మహేశ్, లక్ష్మణరావు, మరో వ్యక్తి బంగారం కోసం హత్య చేశారు. మహిళ భర్త ప్రసాదరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాదనలు విన్న పదో అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కమ్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఉమశునంద ముగ్గురు హత్య చేశారని నిర్ధారించి శుక్రవారం తీర్పు చెప్పారు.
News July 5, 2025
సర్పంచి ఎన్నికలు అప్పుడేనా?

TG: BC రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న ఆయనతో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, BCలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. కులగణనపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వివరించారు. BCలకు 42% సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లు సమాచారం.
News July 5, 2025
కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలు శిక్ష: సీఐ చిట్టిబాబు

ఆర్టీసీ కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో తోట్లవల్లూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ సుదీర్‌పై వీరభద్రరావు, ప్రదీప్ కుమార్ దాడి చేశారు. ఈ ఘటనలో కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది.