News January 12, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌(HCL)లో 7 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్(మైనింగ్), బీఈ, పీజీ(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), పీజీ, పీహెచ్‌డీ(జియాలజీ), ఎంఏ( హిందీ, ఇంగ్లిష్), MBBS, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ careershindcopper@gmail.comకు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్ పంపాలి. వెబ్‌సైట్: hindustancopper.com/

Similar News

News February 15, 2026

ఛావా, పుష్ప-2 రికార్డులు బ్రేక్

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోనూ ఇంకా క్రేజ్ తగ్గలేదు. BMSలో లాంగెస్ట్ ట్రెండింగ్(59 రోజులు) ఇండియన్ ఫిల్మ్‌గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలో విక్కీ కౌశల్ ‘ఛావా’(58 D) రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో స్త్రీ-2(57 D), ప్రేమలు, పుష్ప-2(53 D), మంజుమ్మల్ బాయ్స్(50 D) ఉన్నాయి.

News February 15, 2026

శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

image

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.

News February 15, 2026

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌(DIPR)లో 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ(సైకాలజీ) ఫైనల్ ఇయర్, B.Tech/BE(CSE) ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి, ఫిబ్రవరి 27న ఫలితాలను విడుదల చేస్తారు. స్టైపెండ్ నెలకు రూ.5వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in