News February 6, 2026

హిందూపురంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఓ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎరుకల కావిడి నాగేంద్ర తిరగబడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన అత్త-కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు.

Similar News

News February 21, 2026

T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

image

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్‌లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్‌లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

News February 21, 2026

టెన్నిస్‌లో నారాయణపేట అదనపు ఎస్పీకి స్వర్ణం

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రథమస్థానంలో నిలిచారు. సైబరాబాద్ సీపీ రమేశ్ స్వర్ణ పతకాన్ని అందించి అభినందించారు.

News February 21, 2026

NRPT: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో బంగారు పతకం

image

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్ 16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.