News December 26, 2025

హిందూపురంలో హత్య..!

image

హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్ కామన్ బెడ్డింగ్ సెంటర్‌లో మోద గ్రామానికి చెందిన వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన్నట్లు స్థానికులు తెలిపారు. సెల్‌ఫోన్ విషయమై జరిగిన ఘర్షణ హత్యకు దారితీసిందని చెప్పారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 26, 2025

పార్వతీపురం:104 మొబైల్ మెడికల్ యూనిట్లలో ఉద్యోగాలు

image

రాష్ట్రవ్యాప్తంగా 104 MMUలలో ఖాళీగా ఉన్న డ్రైవర్, DEO పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పార్వతీపురం జిల్లా 104 మేనేజర్ S.కృష్ణ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రవపత్రాలతో డిసెంబరు 27,28 తేదీలలో విజయవాడ మార్కెట్ యార్డ్, గొల్లపూడి DLO office వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు.

News December 26, 2025

ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు..

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 26,130 వద్ద, సెన్సెక్స్ 50 పాయింట్లు కోల్పోయి 85,350 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, టీసీఎస్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

News December 26, 2025

విజయవాడ రైల్వేస్టేషన్ విస్తరణ లేనట్లే..!

image

విజయవాడ రైల్వేస్టేషన్‌ను రూ.650 కోట్లతో అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లతో ఆధునీకరించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న 10 ప్లాట్‌ఫారమ్‌లనే కొనసాగించనున్నారు. కొత్తగా ప్లాట్‌ఫారమ్‌లు పెరుగుతాయని ఆశించిన ప్రయాణీకులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. విజయవాడకు ప్రత్యామ్నాయంగా రాయనపాడు, గుణదల స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.