News February 3, 2025
హిందూపురంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు

హిందూపురం నేడు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులోకి కమిషనర్ అనుమతించిన వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా గుమికూడరాదన్నారు. పట్టణమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Similar News
News July 4, 2025
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభకు INC శ్రేణులు వందలాది వాహనాల్లో తరలివచ్చాయి. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
News July 4, 2025
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
News July 4, 2025
ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లాలో వరదలు ఎప్పుడు సంభవించిన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఆదుకునేందుకు మండలాల వారీగా ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా వరద సహాయక చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని, ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.