News March 23, 2025

హిందూపురంలో 8మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

image

హిందూపురం పరిధిలోని కొట్టిపి, కేంచినపల్లి సమీపంలోని హంద్రీనీవా పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో 8 మందిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.30 వేలు నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూపురం పరిధిలో జూదం ఆడినా.. నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Similar News

News March 25, 2025

దీపక్ హుడాకు అబ్బాయిలంటే ఇష్టం: స్వీటీ

image

కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై ఆయన భార్య స్వీటీ బూరా సంచలన ఆరోపణలు చేశారు. హుడాకు అబ్బాయిలంటే ఆసక్తి అని చెప్పారు. తాను విడాకులు ఇవ్వమని కోరుతున్నానని, ఎలాంటి ఆస్తిని అడగట్లేదని పేర్కొన్నారు. దీపక్ తనను దారుణంగా వేధించడమే కాకుండా చెడుగా చిత్రీకరిస్తున్నాడని తెలిపారు. కాగా దీపక్ తనను వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులకు <<15878772>>ఫిర్యాదు చేసిన<<>> సంగతి తెలిసిందే.

News March 25, 2025

నాకోసం యువీ ఎండలో నిలబడేవారు: KKR డేంజరస్ బ్యాటర్

image

తన బ్యాటింగ్ స్కిల్ మెరుగవ్వడంలో ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ పాత్ర ఉందని KKR యువ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్ అన్నారు. ఆయనలా బ్యాటింగ్ చేయాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ‘యువీ కొన్నిసార్లు తన ప్రాక్టీస్ వదిలి నేను ప్రాక్టీస్ చేసే PCA స్టేడియం వచ్చేవారు. కొన్నిసార్లు అంపైర్ ప్లేస్‌లో ఎండలో నిలబడి గంటల కొద్దీ వీడియోలు రికార్డు చేసేవారు. వాటిని ఇంటికెళ్లి విశ్లేషించి నాకు సలహాలు ఇచ్చేవారు’ అని తెలిపారు.

News March 25, 2025

BREAKING: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

image

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని శాంతినగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!