News September 14, 2024

హిందూపురంలో CM చిత్రపటానికి పోలీసుల క్షీరాభిషేకం

image

హిందూపురం పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం ఎక్సైజ్ పోలీసులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు కమలాకర్, రాంప్రసాద్‌లు మాట్లాడుతూ.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖను విలీనం చేస్తూ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరణ చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

Similar News

News February 19, 2026

మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

image

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.

News February 19, 2026

‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.