News February 13, 2025
హిందూపురం అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలి: కలెక్టర్

హిందూపురం నియోజకవర్గం అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో హిందూపురం నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం దార్శనిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే సలహాలు తీసుకొని నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News September 16, 2025
భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.
News September 16, 2025
మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ కన్నుమూత

కాకినాడకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. 1964-65 సీజన్లో విశాఖపట్నం – హైదరాబాద్‌తో ఆయన అరంగేట్రం చేశారు. ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందారు. 16 రంజీ మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో సహా 503 పరుగులు చేశారు. ఆయన మృతికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీశ్ బాబు, తూ.గో క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
News September 16, 2025
HYDలో ఒక్కో ఎకరం రూ.101 కోట్లు

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.