News March 22, 2024

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి

image

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆయన 1996లో ఉమ్మడి అనంత జడ్పీ ఛైర్మన్‌గా, 1999లో హిందూపురం ఎంపీగా, 2009, 2014లలో వరసగా పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారయణ చేతిలో ఓడిపోయారు.

Similar News

News September 27, 2025

పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా సంబంధిత శాఖ అధికారులు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆహ్వానించాలన్నారు.

News September 26, 2025

తల్లి మందలించిందని కొడుకు సూసైడ్

image

అతిగా మద్యం తాగుతున్నాడని తల్లి కొడుకును మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. చిట్టూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్(24) పదేపదే మద్యం తాగుతున్నాడని తల్లి పెద్దక్క మందలించింది. రాత్రి ఇంటి నుంచి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అనంతపురానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

News September 26, 2025

విద్యార్థికి 4 ఏళ్ల B.Tech జీవితం ఎంతో కీలకం: JNTU వీసీ

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెషర్స్ డే’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థికి 4 ఏళ్ల B.Tech జీవితం ఎంతో కీలకం అన్నారు. ప్రతీ విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.