News October 10, 2025
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపును శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దివ్యాంగుల పెన్షన్ కోసం రీ అసెస్మెంట్‌లో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు సదరం క్యాంప్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడి సేవలందించాలని కలెక్టర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News October 10, 2025
జగిత్యాల: ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణకు సహకార సంఘాలు సిద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణపై శుక్రవారం సహకార సంఘాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం సేకరణకు వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పౌరసరఫరాల అధికారి, మేనేజర్ తదితరులున్నారు.
News October 10, 2025
సంగారెడ్డి: 24 నుంచి సమ్మేటివ్ -1 పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 24 నుంచి 30 వరకు సమ్మేటివవ్- 1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
News October 10, 2025
మద్నూర్: తిట్టాడని కట్టెలతో కొట్టి చంపారు: DSP

డబ్బుల విషయంలో జరిగిన హత్య కేసులో 8మందిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ DSP విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మద్నూర్ మండలం సోమూరులో SEP 28న డబ్బులు బాకీ విషయంలో రాజ్‌కుమార్ తిట్టడంతో, ఆగ్రహించిన 8మంది అతన్ని తీవ్రంగా కొట్టారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు DSP వెల్లడించారు. CI రవికుమార్, SI విజయ్ కొండ ఉన్నారు.