News January 1, 2026

హిందూపురం బ్యాంకు దోపిడీ కేసు.. మరో దొంగ అరెస్ట్

image

హిందూపురంలోని తూముకుంట SBI దోపిడీ కేసులో రెండో నిందితుడు మహమ్మద్ ఇష్రార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సతీశ్ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన అతడి వద్ద నుంచి రూ.5.50 కోట్ల విలువైన 5,500 గ్రాముల బంగారం, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే హరియాణాకు చెందిన అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేయగా, సాంకేతిక ఆధారాలతో రెండో నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Similar News

News January 8, 2026

నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్‌ఎస్‌లో వివరాల అప్‌లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్‌బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.

News January 8, 2026

ములుగు: లెప్రసీ నివారణకు చర్యలు

image

జిల్లాలో లెప్రసీ( కుష్టు) వ్యాధిగ్రస్థుల గుర్తింపు, వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా లెప్రసీ నియంత్రణ అధికారి డా.చంద్రకాంత్ తెలిపారు. గత డిసెంబర్‌లో 18-31 తేదీల మధ్య జిల్లాలోని వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో “లెప్రసీ కేస్ డిటెక్టివ్ క్యాంపెయిన్ “(LCDC) కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 42 అనుమానిత కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. జిల్లాలో 2 పీవీ, 9 ఎంబీ కేసులు ఉన్నాయన్నారు.

News January 8, 2026

తలకొండపల్లి: రేపటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

image

తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో వెలసిన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా 9న గణపతి పూజ, లక్ష్మీనరసింహస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, 10న పుష్పార్చన, అభిషేకం, బండ్లు తిరుగుట, 11న మధ్యాహ్నం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.