News February 25, 2025
హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

హిందూపురం దివంగత మాజీ శాసనసభ్యుడు రంగనాయకులు సతీమణి ఈశ్వరమ్మ మంగళవారం ముదిరెడ్డిపల్లిలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి, కౌన్సిలర్లు మద్దన జయప్ప, మహేశ్ గౌడ్ ఈశ్వరమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగనాయకులకు సహధర్మచారిణిగా అన్ని పార్టీల నాయకులకు ఈశ్వరమ్మ సుపరిచితురాలని పేర్కొన్నారు. కాగా రంగనాయకులు 1985-85, 2004-9 మధ్య MLAగా ఉన్నారు.
Similar News
News February 25, 2025
స్పీకర్‌కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి

స్పీకర్ అయ్యన్నపాత్రుడుని యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం కలిశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తనను పిలవట్లేదన్నారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ పర్యటనకు వచ్చినా తమకు ఎటువంటి ఆహ్వానం లేదన్నారు.
News February 25, 2025
రంజాన్ మాసం ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మసీదుల వద్ద పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలన్నారు.
News February 25, 2025
ఇంటర్ పరీక్షలుసజావుగా నిర్వహించాలి- కలెక్టర్

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.