News April 24, 2024
హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానంద నామినేషన్

హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం హిందూపురం తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ కుమార్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. హిందూపురం శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
అనంత జిల్లాలో చలివేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో నియోజకవర్గ వారిగా డెవలప్మెంట్ ప్లాన్‌ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో చలివేంద్రాలను అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత ఆర్ఓ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు.
News April 22, 2025
పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News April 22, 2025
అర్జీలకు పరిష్కారం చూపండి: కలెక్టర్ ఆదేశం

ప్రజల అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు.